ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో ప్రదీప్ చాలా ప్రశ్నలు అడిగాడు శ్రీలీల కూడా అలాగే ఆన్సర్స్ ఇచ్చింది. "శ్రీలీల గారు మీరు ఏ సీజన్ లో ఐనా ఒకేలా ఉంటారనే విషయం తెలిసింది.. మాములుగా అందరికీ వర్ష కాలంలో జలుబు వస్తుంది...సమ్మర్ లో వేడిగా ఉంటుంది. మీరు మాత్రం సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అని లేకుండా అదే పనిగా తుమ్ముతూ ఉంటారట" అని అడిగాడు. "కరెక్ట్ అండి..నాది పొడుగు ముక్కు కదా..కొంచెం ముక్కు ప్రాబ్లమ్ కూడా ఉంది...ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..గోరు వెచ్చటి నీటితోనే ఫేస్ వాష్ చేసుకోవాలి...చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటే అదే పనిగా తుమ్ములు వచ్చేస్తాయి.." అని చెప్పింది శ్రీలీల. "చిన్నప్పుడు నేను స్కూల్ టీచర్ కి లీవ్ లెటర్ రాసా. దాని తర్వాత చాలామంది చాలా రాసా..మీకు కూడా చాలామంది రాసుంటారు.
మీరు రాసిన లెటర్ గురించి అడుగుదామనుకుంటున్నా..ఎందుకంటే నా దగ్గరకు మీరు రాసిన లెటర్ వచ్చింది..." అని ప్రదీప్ చెప్పేసరికి దానికి ఆన్సర్ శేఖర్ మాష్టర్ ని చెప్పమని చెప్పింది శ్రీలీల.."ఇటలీలో షూటింగ్ జరిగేటప్పుడు ఒక షాట్ లో శ్రీలీల సైకిల్ తొక్కుతూ రావాలి..మరో వైపు నుంచి హీరో వస్తాడు. ఐతే ఎక్కడో సీన్ కి సింక్ మిస్ అయ్యిందని దాదాపు 20 టేక్స్ చేయాల్సి వచ్చింది. శ్రీలీల తన వల్ల ఇదంతా జరిగింది అనుకుని సారీ చెప్తూ ఒక లెటర్ రాసి పంపించింది...కానీ అన్ని టేక్స్ తీసుకున్నది తన వల్ల కాదు అనే విషయం తనకు తెలీదు. షూటింగ్ టెన్షన్ లో ఉన్న నేను ఆ లెటర్ ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఆ లెటర్ ని చూసాను..అది సారీ లెటర్...సారి మాష్టర్..నా వల్ల ఇంత లేట్ ఐపోయింది అని అందులో ఉంది. నీ వల్ల జరిగిన తప్పు కాదు అని చెప్పాను. ఐతే నాకు తెలీదు తన వల్ల ఏం జరిగిన సారీ లెటర్ పంపిస్తుందని" అని శేఖర్ మాష్టర్ చెప్పారు. "అసలు ఇంతకు ఆ లెటర్ ని ఎలా మొదలు పెట్టారు" అని మళ్ళీ ప్రదీప్ అడగడంతో " సారీ మాష్టర్ నా వల్ల మీకు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి...ఇన్ని టేక్స్ అయ్యాయి. నెక్స్ట్ టైం ఇంకొంచెం సీరియస్ గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాను" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు.